ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 06, 2020 , 10:42:52

గాంధీ నుంచి పరారైన కరోనా బాధితుడు

గాంధీ నుంచి పరారైన కరోనా బాధితుడు

హైదరాబాద్‌: గాంధీ దవాఖానలో చికిత్సపొందుతున్న కరోనా బాధితుడు పారారయ్యాడు. గద్వాలకు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేరాడు. అతన్ని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి అతడు దవాఖాన నుంచి పరారయ్యాడు. దీంతో అతనిపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి పరిసరప్రాంతమైన చిలకలగూడ, అతని స్వస్థలమైన గద్వాలలో గాలిస్తున్నారు. 


logo