గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 18:35:16

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉంది

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉంది

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.  పండుగల సీజన్లో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. స్వీయ నియంత్రణలో పండుగలు జరుపుకోవాలని కోరారు. చలికాలంలో వైరస్‌ మరింత విజృంభించే అవకాశం ఉన్నందున, రానున్న మూడు నెలలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

అంటువ్యాధులు ప్రబలకుండా ఇప్పటివరకు 182 వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తామని, బస్తీ దవాఖానలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని 24 గంటలపాటు ఇవి పనిచేస్తాయని తెలిపారు.  అత్యవసర వైద్య  సేవలు అందించేందుకు 102, 104, 108 వాహనాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. కలుషిత నీటి ద్వారా అంటువ్యాధులు ప్రబలే అవకాశముందని, ప్రజలు కాచీచల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. తాగునీటి శాంపిళ్లను పంపినట్లు చెప్పారు. ప్రతి జీహెచ్‌ఎంసీ పునరావాస కేంద్రంలో వైద్య శిబిరం ఉంటుందని, ఈ కేంద్రంలో వైద్యపరీక్షలతోపాటు కరోనా పరీక్ష సైతం చేయనున్నట్లు వెల్లడించారు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.