గురువారం 28 మే 2020
Telangana - May 01, 2020 , 11:43:04

మ‌ల‌క్‌పేట మార్కెట్‌లో క‌రోనా క‌ల‌క‌లం

మ‌ల‌క్‌పేట మార్కెట్‌లో క‌రోనా క‌ల‌క‌లం

హైదరాబాద్: మలక్‌పేట మార్కెట్‌లో కరోనా క‌ల‌క‌లం సృష్టించింది. మార్కెట్‌లోని ఒక కిరాణా దుకాణంలో ముగ్గురికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు వారిని ఐసోలేష‌న్ కేంద్రానికి త‌ర‌లించారు. మార్కెట్‌ను పూర్తిగా మూసివేశారు. మార్కెట్ ప్రాంతం మొత్తాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు. కాగా, వారం రోజులకు పైగానే మార్కెట్‌ను మూసివేసే అవకాశం ఉందని, అయితే ప్ర‌జ‌లు నిత్యావసర వస్తువులు కొన‌డానికి ఇబ్బంది క‌లుగ‌కుండా చర్యలు తీసుకుంటున్నామ‌ని అధికారులు తెలిపారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo