గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 16:41:39

నల్లగొండ దవాఖానలో మృతి చెందిన వ్యక్తికి.. కరోనా నెగటివ్

నల్లగొండ దవాఖానలో మృతి చెందిన వ్యక్తికి.. కరోనా నెగటివ్

నల్గొండ : జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో కోవిడ్ ఐసో లేషన్ వార్డ్ లో చికిత్స పొందుతూ బి.యాదయ్య  మృతి చెందిన సంఘటనలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం లేదని, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. వేములపల్లి మండలం సల్కూర్ కు చెందిన బి. యాదయ్య (40) జూలై 17 న తీవ్ర శ్వాస సమస్య, దగ్గు, జ్వరంతో అడ్మిట్ అయినట్లు తెలిపారు. కొవిడ్ ఐసీయూ, ఐసొలేషన్ వార్డ్ లో యాదయ్య తో పాటు 19 మంది అనుమానిత కరోనా బాధితులు, 21 మంది పాజిటివ్ రోగులకు వైద్య సిబ్బంది, డాక్టర్ లు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 

యాదయ్య కొవిడ్ తో చనిపోలేదని, దీర్ఘకాలిక శ్వాసకోశ  వ్యాధి (COPD) , అల్కహాలిక్ లివర్ వ్యాధితో బాధ పడుతున్నారని వివరించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ఈ నెల 18న వైద్య సేవలు అందించి శాంపిల్స్ సేకరణ చేశారని పేర్కొన్నారు. వాటిని హైదరాబాద్ కు పరీక్ష నిమిత్తం పంపించామన్నారు. డి పార్ట్ మెంట్  ఆఫ్ బయటెక్నాలజీ లేబరేటరీ, ఉప్పల్ ఇంటరిమ్ రిపోర్ట్ లో కొవిడ్ నెగటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇందులో డాక్టర్ లు,  వైద్య సిబ్బంది నిర్లక్ష్యం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.


logo