సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 13:20:33

మంత్రి ఎర్రబెల్లికి కరోనా నెగిటివ్‌

మంత్రి ఎర్రబెల్లికి కరోనా నెగిటివ్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తన సిబ్బందిలో కొందరికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. ముందస్తు జాగ్రత్తగా సోమవారం ఉదయం కరోనా టెస్టులు చేయించుకున్నట్లు మంత్రి దయాకర్‌రావు తెలిపారు. ఈ ఫలితాల్లో తనకు కరోనా నెగిటివ్‌ వచ్చిందని, తాను ముందగా చెప్పినట్లే ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా సోకిన వారి పట్ల మానవీయత చూపాలన్నారు. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి, విధిగా మాస్కులు ధరించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణలోనే ఉందన్నారు. కరోనా బాధితులకు అవసరమైన మందులు, పరికరాలు, పరీక్షల కిట్లు, వైద్య నిర్వహణకు అవసరమైన ఇతర సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉంటే తక్షణమే సమీప ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా కట్టడి అయ్యే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి దయాకర్‌కు చెప్పారు.


logo