శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 19:02:22

కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ : కరోనాపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని, భయపడాల్సిన అవసరం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగరల్ లోని జనరల్ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ను మంత్రి ప్రారంభించారు. కరోనా రోగులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటు చేశామని తెలిపారు.

జనరల్ దవాఖానలో అత్యాధునిక సౌకర్యాలతో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ కార్పోరేట్ దవాఖానల్లో ఇచ్చే చికిత్స స్థానికంగా ఉచితంగా అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. రోగులు సైతం ఇక్కడ చికిత్స పొంది నయమై సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్ రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేష్, జనరల్ హాల్సిటల్ సూపరింటెండెంట్ రామ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.