గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 22:24:08

వైన్స్‌ షాపుల వద్ద కరోనా మార్కింగ్‌..

వైన్స్‌ షాపుల వద్ద కరోనా మార్కింగ్‌..

హైదరాబాద్ : వైన్స్‌ షాపుల వద్ద మందుబాబులు క్రమ శిక్షణ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. కరోనా నేపధ్యంలో ఒక్కరికి ఒక్కరు తాకకుండా ఉండేందుకు వైన్స్‌ షాపు నిర్వాహకులు ఒక మీటరు దూరంలో ఉండేలా మార్కింగ్స్‌ వేస్తున్నారు.మద్యం అందించే వారు కూడా తప్పని సరిగా ఒక మీటరు దూరం నుంచే ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. ఇలా చేయడం ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉండదని పోలీసులు వివరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రతి వైన్స్‌ దుకాణం వద్ద మీటరు దూరం మార్కింగ్స్‌ను వేసేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


logo