ఆదివారం 06 డిసెంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:20:57

ఎయిర్‌పోర్టులో కరోనా ల్యాబ్‌

ఎయిర్‌పోర్టులో కరోనా ల్యాబ్‌

  • ప్రారంభించిన వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల

మణికొండ: విమాన ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ, విదేశాలకు వెళ్లేవారు సురక్షితంగా ప్రయాణించడానికి ఈ కరోనా పరీక్షా కేంద్రం దోహపడుతుందని చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య నిబంధనల ప్రకారం.. దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు 96 గంటలలోపు తీసుకున్న కరోనా నెగెటివ్‌ ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు ఉండాలని అన్నారు. వెళ్తున్న గమ్యస్థానంలో నెగెటివ్‌ ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు కావాల్సిన ప్రయాణికులు ఈ ల్యాబ్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి జీఎమ్మార్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.