బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 17:25:16

ఎమ్మెల్యే రాజాసింగ్‌ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌

ఎమ్మెల్యే రాజాసింగ్‌ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌ : రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, వారి డ్రైవర్లు, గన్‌మెన్లు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ గన్‌మెన్‌కు కరోనా పరీక్ష చేయగా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాజాసింగ్‌, ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ రిపోర్టులు రావాల్సి ఉంది. ఎమ్మెల్యే గన్‌మెన్‌కు పాజిటీవ్‌ అని తేలడంతో ఇటీవల ఎమ్మెల్యేను కలిసిన వారు, సన్నిహితుల్లోనూ ఆందోళన మొదలైంది.

ప్రస్తుతం రాజాసింగ్‌ కుటుంబం హోం క్వారంటైన్‌ ఉంది.  ఈ విషయాన్ని రాజాసింగే ట్వీటర్‌ ద్వారా తెలియజేశారు. కరోనాను ఎదురుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామాలు చేసి ఫిట్‌ ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య  అతకంతకూ పెరుగుతుండడంతో భాగ్యనగర వాసులు అందోళన చెందుతున్నారు.logo