గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 13:02:28

హైదరాబాద్‌లో కరోనా తీవ్రత తక్కువే: సీపీ అంజనీకుమార్

హైదరాబాద్‌లో కరోనా తీవ్రత తక్కువే: సీపీ అంజనీకుమార్

హైదరాబాద్‌: దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కరోనా తీవ్రత తక్కువగానే ఉందని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే మరణాల రేటు కూడా తక్కువగానే ఉన్నదని పేర్కొన్నారు. అంబర్‌పేట పోలీసు మైదానంలో పోలీసు వాహనాలకు శానిటైజేషన్‌ కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు. క్రాఫ్ట్‌ సంస్థ సహకారంతో అన్ని పోలీసు వాహనాలను శానిటైజేషన్‌ చేయనున్నారు.

కరోనా నియంత్రణకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి పోలీసులు తమ విధుల్లో కఠోరంగా శ్రమిస్తున్నారని వెల్లడించారు. కరోనాకు భయపడకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. నియమాలు, వైద్యుల సూచనలు పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చని  తెలిపారు.


logo