ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 02:48:38

సర్కారు ధరలకే కరోనా వైద్యం

సర్కారు ధరలకే కరోనా వైద్యం

  • సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భాస్కరరావు

బేగంపేట: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కరోనా చికిత్సలు అందిస్తామని, జనరల్‌ వార్డులో చికిత్స తీసుకొనేవారికే ఈ ధరలు వర్తిస్తాయని తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. కరోనాతోపాటు గుండె, కాలేయం తదితర వ్యాధులతో బాధపడేవారికి మందులు, చికిత్సకు అయ్యే ఖర్చులు అదనంగా ఉంటాయని స్పష్టంచేసింది. మంగళవారం సికింద్రాబాద్‌ కిమ్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ భాస్కర్‌రావు, డాక్టర్‌ గోవింద్‌ హరి వివరాలు వెల్లడించారు. వైరస్‌ లక్షణాలు కొద్దిగా కనిపించగానే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, కరోనాతో మరణించేవారి సంఖ్య 4నుంచి 6 శాతమేనని తెలిపారు. 60 ఏండ్లు పైబడి రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారే మరణిస్తున్నారనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పారు.  వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి ఆక్సిజన్‌ అవసరం ఉన్నవారే దవాఖానలో చేరాలన్నారు.


logo