సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 17:44:58

బెల్లంపల్లి మండలంలో మహిళకు కరోనా

బెల్లంపల్లి మండలంలో మహిళకు కరోనా

బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామానికి చెందిన 30ఏళ్ల మహిళకు శనివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది సదరు మహిళ కుటుంబీకుల వివరాలు సేకరించి, 12 మందిని హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. సదరు మహిళ 40 రోజుల కిందట కరీంనగర్‌లోని ఓ దవాఖానలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడి నుంచి గ్రామానికి వచ్చింది. ఇటీవల అనారోగ్యానికి గురవగా, కరీంనగర్‌లో చికిత్స పొందుతుండగా వైద్యులు ముందస్తుగా కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలడంతో హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు. ఆమె తల్లితో పాటు మరికొందరికి గాంధీలో కరోనా పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం.


logo