సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 13:43:12

వరంగల్‌ ఎంజీఎంలో ఆరుగురికి కరోనా

వరంగల్‌ ఎంజీఎంలో ఆరుగురికి కరోనా

వరంగల్‌ : వరంగల్‌ ఎంజీఎం దవాఖానలో సోమవారం ఆరుగురికి కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. ఆదివారం దవాఖానలో చేరిన 13 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 6గురికి పాజిటీవ్‌ రిపోర్టు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇందులో ఈ నెల 6న బ్రాహ్మణవాడలో ఓ టీచర్‌కు కరోనా పాజిటీవ్‌ రాగా.. అతని భార్య, కూతురికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలిపారు.

కాజీపేట విష్ణుపురికి చెందిన భార్యాభర్తలిద్దరికీ పాజిటీవ్‌ రాగా.. వారు వారం రోజులు హైదరాబాద్‌లో ఉండి ఆదివారం వరంగల్‌ ఎంజీఎంలో చేరారు. జనగామ జిల్లాకు చెందిన 37ఏళ్ల మహిళలకు పాజిటీవ్‌ రాగా, ఎమ్మెల్యే గన్‌మెన్‌కు రెండో సారి నిర్వహించిన పరీక్షలో పాజిటీవ్‌ వచ్చినట్లు తెలిపారు. 


logo