బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 18:25:23

కరోనా మాయ.. రివర్సైన లైఫ్‌ సీన్‌

కరోనా మాయ.. రివర్సైన లైఫ్‌ సీన్‌

అప్పుడు: ముద్దూ ముచ్చట

ఇప్పుడు: ముద్దేంటి, తాకడమే తప్పు


అప్పుడు: పక్కింటి పుల్లకూర ఎంతో రుచి

ఇప్పుడు: మనఇంటి గంజి కూడా మహారుచి.


అప్పుడు: కష్టం వస్తే కౌగిలించుకొని ఊరడించాము

ఇప్పుడు: కష్టం వస్తే కళ్ళతోనే దయ చూపిస్తాం.


అప్పుడు: జీవితంలో నాలుగురిని సంపాదించుకో

ఇప్పుడు: ఆ నలుగురు కనబడటం లేదు.


అప్పుడు: ముసుగులో గుద్దులాట

ఇప్పుడు: మాస్కుతో మాట్లలాట.


అప్పుడు: జగదభిరమా రఘుకులసోమా కరుణను జూపవయా

ఇప్పుడు: జగదాభిరామా రఘుకులసోమా కరోనాను జంపవయా.


 - తుమ్మ జనార్ధన్


logo