ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 13:19:10

కామారెడ్డి జిల్లాలో కరోనా కలకలం

కామారెడ్డి జిల్లాలో కరోనా కలకలం

కామారెడ్డి : జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ముంబై నుంచి 13 రోజుల క్రితం వచ్చిన ఓ మహిళ రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో తన మేనమామ ఇంటికి చేరుకుంది. సదరు మహిళను ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వైద్యులు వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షించారు. అయితే ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో కామారెడ్డి జిల్లా ఏరియా హాస్పిటల్ నుంచి హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. 

అలాగే జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో 60 ఏళ్ల వృద్ధుడు గత నెల 30వ తేదీన ఏరియా దవాఖానకు వెళ్లగా దగ్గు, దమ్ము, ఆస్తమా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అతడిని గాంధీ దవాఖానకు రెఫర్ చేశారు. అక్కడ పరీక్షలు చేయడంతో పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులు 13 మందిని హోమ్ క్వారంటైన్ లో ఉంచారు.


logo