బుధవారం 03 జూన్ 2020
Telangana - May 13, 2020 , 14:19:02

స్వీయ క్రమశిక్షణతోనే కరోనా దూరం : రాచకొండ సీపీ

స్వీయ క్రమశిక్షణతోనే కరోనా దూరం : రాచకొండ సీపీ

యాదాద్రి భువనగిరి: జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై భౌతిక దూరాన్ని పాటించాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలోని ఎయిమ్స్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అలాగే జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి కొత్త వ్యక్తులు వస్తే హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసు అధికారును ఆదేశించారు. ఆయన వెంట డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ భుజంగరావు, ఎయిమ్స్ సిబ్బంది తదితరులున్నారు.


logo