గురువారం 09 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 09:39:31

గుండె వ్యాధి చికిత్సకు ఆస్పత్రికి వెళితే...

గుండె వ్యాధి చికిత్సకు ఆస్పత్రికి వెళితే...

నల్గొండ: గుండె సంబంధిత వ్యాధితో చికిత్సకు ఆస్పత్రికి వెళితే  కరోనా పాజిటివ్‌ నివేదిక రావడంతో ఆ యువకుడి కుటుంబం  ఆందోళనకు గురవుతుంది. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురం గ్రామ పంచాయతీ కొట్టాలగడ్డలో ఓ యువకుడు గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. 

అతడు 10 రోజుల క్రితం చికిత్స కోసం  హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. ఇదే క్రమంలో వైద్యులు అతడికి  కరోనా పరీక్షలు సైతం నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ యువకుడిని మెరుగైన చికిత్స కోసం పీఏపల్లి వైద్య సిబ్బంది హైదరాబాద్‌కు తరలించారు. అసలే గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతుండగా కరోనా నిర్ధారణ కావడంపై  కుటుంబ సభ్యులు ఆందోళనకు గురువుతున్నారు. 


logo