గురువారం 28 మే 2020
Telangana - May 17, 2020 , 02:01:06

సమిష్టి కృషితో కరోనా తగ్గుముఖం

సమిష్టి కృషితో కరోనా తగ్గుముఖం

  • ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి, నమస్తేతెలంగాణ/మంథని టౌన్‌: సీఎం కేసీఆర్‌ ముందు చూపు.. వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బంది సమిష్టి కృషితోనే రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా మంథనిలో జెడ్పీచైర్మన్‌ పుట్ట మధూక ర్‌ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ‘మీ సేవలకు మా సత్కారం’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌ మండలాల్లోని పారిశుద్ధ్య, వైద్య, పోలీసు అధికారులు, సిబ్బంది 930మందిని సన్మానించారు. అలాగే పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు, రెడ్‌క్రాస్‌ సొసైటీల ఆధ్వర్యంలో  360 మంది రక్తదానం చేశారు.  logo