శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 00:36:55

కరోనా కట్టడికి నిఫుణుల కమిటీ

కరోనా కట్టడికి నిఫుణుల కమిటీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ ‘కోవిడ్‌  19’పై అధ్యయనం, ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఐదుగురు సభ్యులతో నిఫుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఏర్పాటుచేసింది. ఈ ఐదుగురిలో సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ కే మిశ్రా, కేఎన్నార్‌యూహెచ్‌ఎస్‌ వైస్‌చాన్సలర్‌ డాక్టర్‌ బీ కరుణాకర్‌రెడ్డి, ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ చంద్రశేఖర్‌, నిమ్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టీ గంగాధర్‌, హెచ్‌ఎంఆర్‌ఐ మాజీ వ్యవస్థాపకుడు, సీఈవో బాలాజీ ఉట్ల ఉన్నారు.

ఈ కమిటీ కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ దేశాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, గణాంకాలపై అధ్యయనం చేయనుంది. కొవిడ్‌-19ను నిర్మూలించే క్రమంలో పరిణామాలు, గణాంకాలపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ నిర్మూలనలో విజయవంతంగా పనిచేసిన నమూనాలపై ఈ కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.logo