బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:11:45

కరోనా నియంత్రణ కార్డులు.. అబద్ధం

కరోనా నియంత్రణ కార్డులు.. అబద్ధం


‘వైరస్‌ షట్‌ ఔట్‌' పేరుతో తయారైన మేడ్‌ ఇన్‌ జపాన్‌ కార్డులు మెడలో వేసుకుంటే చుట్టూ ఒక మీటరు వరకు కరోనా రాదు. ఒక్కో కార్డును రూ.300 నుంచి రూ.500 వరకు ఆన్‌లైన్‌తోపాటు హైదరాబాద్‌లోని కొన్ని మెడికల్‌ షాపుల్లో విక్రయిస్తున్నారు. ఇందులోని సోడియంహైపోక్లోరైట్‌, న్యాచురల్‌ జిమోలైట్‌ రసాయన మిశ్రమం శరీరానికి రక్షణ ఇస్తుం ది. ఈ విధంగా ప్రచారం జరుగుతున్నది. చాలామంది ఇది నిజమని నమ్మి ఈ కార్డులను ఎగబడి కొంటున్నారు.

కరోనా ముందు ఇలాంటి జిమ్మిక్కులు పనిచేయవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కార్డులు అనవరంగా కొనుగోలుచేసి మెడలో వేసుకొని తిరిగితే వైరస్‌ను కొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు. అపోహలు ఎవరూ నమ్మొద్దని, మాస్కులు ధరించడం, భౌతికదూరం,  ఇతర జాగ్రత్తలతోనే వైరస్‌కు దూరంగా ఉండొచ్చని ఫీవర్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ స్పష్టంచేశారు. ఏవో రసాయన మిశ్రమంతో తయారైన కార్డులతో వైరస్‌ సోకదనే ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని సూచించారు.

- గోల్నాక


logo