బుధవారం 03 జూన్ 2020
Telangana - May 15, 2020 , 07:53:35

ప్రపంచవ్యాప్తంగా 45.20 లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా 45.20 లక్షలకు చేరిన కరోనా కేసులు

ఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా 213 దేశాలకు వ్యాపించింది. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 45 లక్షల 20 వేలకు చేరుకున్నాయి. కరోనా బారినపడి 3 లక్షల మంది బాధితులు మృతువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఆస్పత్రిలో చికిత్స అనంతరం 17 లక్షల మంది బాధితులు కోలుకున్నారు.

 మన దేశంలో కూడా కరోనా ఉదృతి కొనసాగుతోంది. 83,906 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 2650 మంది బాధితులు మృతి చెందారు. చికిత్స అనంతరం 27,924 మంది బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.  

అమెరికాలో కోరోనా ఉదృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 25,710 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1693 మంది మృతి చెందారు. దీంతో అమెరికాలో 14.56 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడి 86,890 మంది మృత్యువాత పడ్డారు. 


logo