శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 01:57:45

జిల్లాల్లో జర పైలం

జిల్లాల్లో జర పైలం

  • ద్వితీయ శ్రేణి నగరాల్లో కరోనా విజృంభణ
  • నిత్యం 100కుపైగా నమోదవుతున్న కేసులు
  • నిర్లక్ష్యం వీడాలంటున్న వైద్య నిపుణులు

ఇన్నాళ్లూ అధిక జనసాంద్రత గల జీహెచ్‌ఎంసీ పరిధిలో పంజా విసిరిన కరోనా.. కొద్ది రోజులుగా జిల్లాల్లో విజృంభిస్తున్నది. వైద్యారోగ్యశాఖ భారీగా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ద్వితీయశ్రేణి నగరాల్లో వైరస్‌వ్యాప్తి పెరుగడంతో పలు జిల్లాల్లో 100కు పైగా, మరికొన్ని జిల్లాల్లో 50కి పైగా కేసులు రికార్డవుతున్నాయి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సమయంలో కట్టుదిట్టంగా వ్యవహరించడంతో జిల్లాల్లో కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి. అనంతరం లాక్‌డౌన్‌ సడలింపులతో కార్యకలాపాలు పెరిగాయి. ప్రజల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన వారం పదిరోజుల నుంచి పెద్దమొత్తంలో పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. గతంలో రాష్ట్రవ్యాప్తంగా నిత్యం 20 వేల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు మాత్రమేచేపట్టగా, ఇప్పుడు ప్రతిరోజు 60 వేల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌తోపాటు అవసరమైనవారికి ఆర్టీపీసీఆర్‌ నిర్వహిస్తున్నారు. జగిత్యాల, కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, మంచిర్యాల, మేడ్చల్‌ మల్కాజిగిరి, నల్లగొండ, నిజామాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో ప్రతిరోజు 100 వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. 

నిర్లక్ష్యంతోనే వైరస్‌ వ్యాప్తి

మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రంచేసుకోవడం వంటివి పాటిస్తే వైరస్‌ సోకే ప్రమాదం చాలా తక్కువని    వైద్యాధికారులు చెప్తున్నప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమకు వైరస్‌ సోకదని, సోకినా అది ఏమీ చేయదని చాలామంది భావి  స్తున్నారు. తీరా వైరస్‌ సోకిన తర్వాత ఆందోళన చెందుతున్నారు. మరోవైపు 80శాతం మందిలో వైరస్‌ సోకినా ఎలాంటి లక్ష ణాలు కనిపించకపోవడం వల్ల కొం దరు అందరిలో కలివిడిగా తిరుగుతున్నారు. వీరు వైరస్‌కు వాహకాలుగా మారి ఒకరినుంచి మరొకరికి సంక్రమించేందుకు కారణం అవుతున్నారు. ఇలా స్వీయ రక్షణ చర్యలు పాటించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో జిల్లా ల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కేవలం మాస్కులు ధరించడం వల్ల వైరస్‌ బారిన పడకుండా 70శాతం వరకు కాపాడు        కోవచ్చని సూచిస్తున్నారు.


logo