ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 01:29:27

5 వేలు దాటిన కేసులు

5 వేలు దాటిన కేసులు

  • కొత్తగా 219 మందికి కరోనా - జీహెచ్‌ఎంసీలోనే 189 కేసులు
  • ఇద్దరి మృతి, 389 మంది డిశ్చార్జి - ఎమ్మెల్యే గణేశ్‌గుప్తాకూ పాజిటివ్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా  బాధితుల సంఖ్య ఐదు వేలు దాటింది. సోమవారం 219 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 189 ఉన్నాయి. రంగారెడ్డి 13, వరంగల్‌ అర్బన్‌ 4, వరంగల్‌ రూరల్‌ 3, సంగారెడ్డి 2, మేడ్చల్‌ మల్కాజిగిరి 2, మహబూబ్‌నగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి భువనగిరి, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. వైరస్‌ తీవ్రతకు తోడు ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5,193 కేసులు నమోదు కాగా, ఇందులో 187 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాకు కరోనా

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డితో భేటీ అ య్యారు. చికిత్స కోసం గణేశ్‌గుప్తా హైదరాబాద్‌ వెళ్లారు.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి డిశ్చార్జి

చేర్యాల: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి యశోద దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. హైదరాబాద్‌ హబ్సిగూడలోని ఇంటికి చేరుకున్నట్టు ఆయన సతీమణి పద్మలతారెడ్డి తెలిపారు. ముత్తిరెడ్డి మరోడ్రైవర్‌కు కరోనా సోకిందని, ఆయన హోంక్వారంటైన్‌కు పంపించినట్టు పద్మలతారెడ్డి పేర్కొన్నారు.

ఉట్నూర్‌ బాలింతకు వైరస్‌

ఉట్నూర్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌కు చెందిన ఓ బాలింతకు కరోనా సోకింది. స్థానిక ప్రభుత్వ దవాఖాన నుంచి ఇటీవల ఆదిలాబాద్‌ రిమ్స్‌కు కాన్పుకోసం వెళ్లిం ది. రక్తహీనత ఉండటంతో వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్‌చేశారు. కోఠిలోని మెటర్నరీ దవాఖానలో ప్రసవం కాగా, అదేరోజు శ్వాసకోస ఇబ్బంది తలెత్తడంతో పుట్టిన బిడ్డ చనిపోయింది. బాలింతకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తెలింది. దీంతో ఆమెను గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె కుటుంబసభ్యులను హోంక్వారంటైన్‌ చేశారు.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు      
సోమవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
219
5,193  
డిశ్చార్జి అయినవారు
389
2,766
మరణాలు
2187
చికిత్స పొందుతున్నవారు
-2,240


logo