మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 12:33:50

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగికి కరోనా

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగికి కరోనా

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన హైదరాబాద్‌లో పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నగరంలోని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ఓ సెక్షన్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను అధికారులు ఇళ్లకు పంపించి, శానిటైజేషన్‌ చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో సుమారు 15 వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 154 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 132 మంది కరోనా బాధితులు ఉన్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 3650 కరోనా కేసులు నమోదవగా, 137 మంది మరణించారు. 1742 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 1771 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.


logo