శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 09, 2020 , 19:08:10

స్వీయ నియంత్రణ, సమన్వయంతో కరోనా కట్టడి

స్వీయ నియంత్రణ, సమన్వయంతో కరోనా కట్టడి

హైదరాబాద్ : మ‌రికొద్ది రోజుల పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు మ‌రింత అప్రమత్తంగా ఉండాల‌ని పంచాయతీ రాజ్ శాఖ మత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు హైద‌రాబాద్ లోని మంత్రి నివాసం నుంచి పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తొర్రూరు, రాయ‌ప‌ర్తి మండ‌లాలు, తొర్రూరు పట్టణం వారీగా,  ప్రజా ప్రతినిధులు, శాఖ‌ల అధికారులతో మంత్రి, టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. వ‌ర్షాకాలం కావ‌డం, వాతావ‌ర‌ణం చల్లబడ‌టంతో వైర‌స్ విస్తరణ కూడా పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. న‌గ‌రాల నుంచి ప‌ల్లెల‌కు విస్తరించిన కరోనా వైరస్ ను ఇప్పుడు అరికట్టలేక పోతే, ప్రజలు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంద‌న్నారు.  ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చిరంచారు. రాజ‌కీయాల‌కు, రాగ‌ద్వేషాల‌కు అతీతంగా అందరూ ఏకం కావాల‌న్నారు.

గ్రామ‌, మండ‌ల స్థాయిలో క‌మిటీలు వేసుకుని, ఎప్పటికప్పుడు  స‌మీక్షిస్తూ, క‌రోనా బాధితుల‌ను ఆదుకోవాల‌న్నారు. త్వరలోనే నియోజ‌క‌వ‌ర్గానికి రెండు అంబులెన్స్ లు, నాలుగు లక్షల మాస్కుల‌ను త‌మ ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక వాహ‌నం తొర్రూరు కేంద్రంగా, మ‌రో వాహ‌నం పాల‌కుర్తి కేంద్రంగా ఉంటాయ‌న్నారు. 

మాస్కులు లేకుండా ఎవ‌రైనా తిరిగితే, వారిపై జ‌రిమానాలు విధించాల‌న్నారు. వివిధ హాస్పిటల్స్ కి స‌రిప‌డా పీపీఈ కిట్లు, మందులు, మాస్కులు, ఆక్సీజ‌న్ వంటి అన్ని ర‌కాల స‌దుపాయాలు అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. అధికారుల‌ను ఆదేశించారు. ఉపాధి హామీ ప‌థకాన్ని అనుసంధానిస్తూ ఆయా పనుల‌ను స‌త్వరమే పూర్త చేయాల‌న్నారు. 


logo