సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 01:40:24

కొత్త కేసులు 1,850

కొత్త కేసులు 1,850

  • జీహెచ్‌ఎంసీలోనే 1,572 మందికి కరోనా
  • ఐదుగురి మృతి,1,342 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో వెలుగుచూస్తున్నాయి. శనివారం కొత్తగా 1,850 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 1,572 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 92, మేడ్చల్‌మల్కాజిగిరి 53, వరంగల్‌ అర్బన్‌ 31, కరీంనగర్‌ 18, నిజామాబాద్‌ 17, నల్లగొండ 10, సంగారెడ్డి 8, ఖమ్మం 7, వరంగల్‌ రూరల్‌ 6, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, సిద్దిపేట 5, జయశంకర్‌ భూపాలపల్లి 4, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, జనగామ 3 చొప్పున, జోగుళాంబ గద్వాల 2, నిర్మల్‌, యాదాద్రిభువనగిరి, మెదక్‌ జిల్లాల్లో 1 కేసు చొప్పున రికార్డయ్యాయి.

కరోనాతోపాటు వివిధ ఆరోగ్య సమస్యలున్న ఐదుగురు మృతిచెందారు. 1,342 మంది డిశ్చార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1,10,545 పరీక్షలుచేయగా, 22,312 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. యదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురంలో 10 నెలల పసిపాపకు, వేములవాడ రాజన్న ఆలయంలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న 17 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో శ్రీవారి ఆలయాన్ని మూసివేసి 11న తిరిగి తెరువనున్నారు. 

టెస్కాబ్‌ వైస్‌చైర్మన్‌కు కరోనా

టెస్కాబ్‌ వైస్‌చైర్మన్‌, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల ఆయన భార్య సునీతకు కరోనా వచ్చింది.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు      
శనివారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
1,850
22,312  
డిశ్చార్జి అయినవారు
 1,342
11,537
మరణాలు
05288
చికిత్స పొందుతున్నవారు
-10,487


logo