గురువారం 04 జూన్ 2020
Telangana - May 08, 2020 , 01:42:12

కొత్తగా 15 పాజిటివ్‌

కొత్తగా 15 పాజిటివ్‌

  • 1,122కు చేరిన మొత్తం కేసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గురువారం కొత్తగా 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో హైదరాబాద్‌ కు చెందిన 12 మంది ఉండగా, మిగిలిన ముగ్గురిని ముంబైకి వలసవెళ్లి వచ్చినవారిగా గుర్తించారు. 45 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,122కు చేరింది. వీరిలో 29 మంది మృతిచెందగా, 693 మంది డిశ్చార్జి అయ్యారు. 400 మంది చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదలచేసింది. వైరస్‌పై ఏమైనా సందేహాలుంటే 104, మానసిక ఇబ్బందులు తలెత్తితే 108కు కాల్‌చేసి సలహాలు, సహాయం పొందాలని పేర్కొన్నది.

ముంబై నుంచి కాలినడకన..

పొట్టచేతపట్టుకొని ముంబైవెళ్లిన కొందరు లాక్‌డౌన్‌తో తినడానికి తిండిదొరకక అవస్థలు పడ్డా రు. ఈ క్రమంలో జనగామ జిల్లాకు చెందిన 9 మంది కాలినడకన తెలంగాణకు పయనమయ్యా రు. మధ్యలో దొరికిన వాహనాలపై కొంత దూ రం ప్రయాణించారు. అలా వాహనాలపై, కాలినడకన ఈ నెల 4న స్వస్థలాలకు చేరుకున్నారు. వీరిలో నలుగురికి గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో వారిని తక్షణం హైదరాబాద్‌కు రప్పించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. మిగిలిన అయిదుగురిని కూడా గుర్తించిన వైద్యారోగ్యశాఖ వారిని కింగ్‌ కోఠి దవాఖానలోని ఐసొలేషన్‌లో ఉంచారు. వారికి శుక్రవారం వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రాం తాల నుంచి మన రాష్ర్టానికి వస్తున్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. 

కోల్‌కతా నుంచి నేడు విద్యార్థుల రాక

లాక్‌డౌన్‌ కారణంగా కోల్‌కతాలో చిక్కుకుపోయిన 75 మంది విద్యార్థులు శుక్రవారం హైదరాబాద్‌కు రా నున్నారు. కోల్‌కతాలో చిక్కుకుపోయిన వారిని రాష్ర్టానికి తీసుకురావాలంటూ వచ్చిన పలు అభ్యర్థనలకు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించి ప్రభుత్వం తరఫున వారిని రప్పిస్తున్నారు. 

రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ రూపొందించిన ‘కరోనా పోరులో రెవెన్యూ సేన’ పాటల సీడీని గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆవిష్కరించారు.


రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
గురువారం
మొత్తం 
పాజిటివ్‌ కేసులు
15
1,122
డిశ్చార్జి అయినవారు
45
693
మరణాలు
-29
చికిత్స
-400


logo