సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 03:20:20

శ్రీశైలంలో రాగి రేకులు

శ్రీశైలంలో రాగి రేకులు

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్ర ప్రధాన ఆలయానికి పరివార ఆలయమైన ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేపడుతుండగా మరోసారి అత్యంత పురాతనమైన రాగి రేకులతోపాటు వెండి నాణేలు బయటపడినట్లు ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. మంగళవారం ఘంటామఠంలో జీర్ణోద్ధరణ పనులు చేస్తున్న సిబ్బందికి 3 తామర శాసనాలు, ఒక రాగి నాణెం, 245 వెండి నాణేలు బయటపడ్డాయి. ఒక రాగి రేకుపై మహారాజు శివలింగాన్ని నమస్కరిస్తున్నట్లుగా ఉండగా, నాణెంపై నందీశ్వరుడు ఒకవైపు.. గోమాత మరోవైపు చిత్రీకరించి ఉన్నాయని ఈవో తెలిపారు. ఇవి 1800-1910 మధ్యకాలంలో బ్రిటీష్‌ కాలం నాటివిగా గుర్తించారు. 


logo