శనివారం 29 ఫిబ్రవరి 2020
రేపే సహకార ఎన్నికలు

రేపే సహకార ఎన్నికలు

Feb 14, 2020 , 02:20:06
PRINT
రేపే సహకార ఎన్నికలు
  • పోలింగ్‌ సమయం: ఉదయం ఏడు గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంటదాకా
  • మధ్యాహ్నం రెండునుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాలు
  • అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసిన సహకారశాఖ
  • ఓటుహక్కు వినియోగించుకోనున్న 12 లక్షల మంది

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 747 పీఏసీఎస్‌ల పరిధిలోని 6,248 మంది డైరెక్టర్‌ పోస్టులకు ఈ నెల 15న (శనివారం) ఎన్నికలు నిర్వహించేందుకు సహకారశాఖ ఎన్నికల అథారిటీ అన్నిరకాల ఏర్పాట్లుచేసింది. ఎన్నికల నిర్వహణకు 747 మంది గెజిటెడ్‌ అధికారులను ఎన్నికల అధికారులుగా, మరో 20 వేలకుపైగా సిబ్బందిని నియమించారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్‌ పత్రాలను ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు అందుబాటులో ఉండేలా సరఫరాచేశారు. సుమారు 12 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరుగనున్నది. మధ్యాహ్నం రెండు నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి.. సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. పాలకవర్గాల నియామకాలను ఎన్నికల ముగిసిన మూడురోజుల్లో చేపట్టనున్నట్టు ఎన్నికల అథారిటీ అధికారులు చెప్పారు. పాలవర్గాల ఎన్నికల సందర్భంగా ఏదైనా సమస్యలు తలెత్తితే కో ఆపరేటివ్‌ చట్టాల ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టంచేశారు.


logo