ఆదివారం 23 ఫిబ్రవరి 2020
ప్రచారంలో సహకార అభ్యర్థులు

ప్రచారంలో సహకార అభ్యర్థులు

Feb 12, 2020 , 01:10:56
PRINT
ప్రచారంలో సహకార అభ్యర్థులు
  • 8,444 డైరెక్టర్‌ పదవులకు బరిలో 13,642 మంది
  • 15న పోలింగ్‌.. అదే రోజు ఫలితాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సహకార ఎన్నికల ప్రచారపర్వం మంగళవారం ప్రారంభమైంది. 32 జిల్లాల పరిధిలో 904 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో ఏకగ్రీవమైన డైరెక్టర్‌ పదవులు, సొసైటీలు పోగా రాష్ట్రవ్యాప్తంగా 768 సొసైటీల పరిధిలోని 8,444 డైరెక్టర్‌ పదవులకు ఈనెల 15న ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా.. 3,224 డైరెక్టర్‌ పోస్టులు, 136 సొసైటీలు ఏకగ్రీవంకాగా.. దాదాపు 13,642 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ఎన్నికలకు మరో 3 రోజుల గడువే ఉండటంతో అభ్యర్థులు తమ కు కేటాయించిన గుర్తులతో గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. 


ప్రతి వార్డులో పరిమితంగానే ఓటర్లు ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రత్యక్షంగా కలుసుకొని ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఏకగ్రీవాలైన సొసైటీలు, డైరెక్టర్‌ పదవుల్లో అత్యధికంగా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. దీంతో ఎన్నికలు జరిగే స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉంటాయ ని.. అత్యధిక పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ దక్కించుకునే అవకాశం ఉన్నదని టీఆర్‌ఎస్‌ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15న ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు 


logo