శనివారం 11 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 13:07:59

కోఆపరేటివ్‌ బ్యాంకులతోనే రైతులకు నిజమైన సహకారం

కోఆపరేటివ్‌ బ్యాంకులతోనే రైతులకు నిజమైన సహకారం

వరంగల్‌ రూరల్‌: సహకార బ్యాంకులు, సొసైటీల ద్వారానే రైతులకు నిజమైన సహకారం అందుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. సహకార బ్యాంకులపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా డీసీసీబీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఉద్యోగులు వ్యవహరించాలని సూచించారు. జిల్లాలోని పర్వతగిరిలో కార్మికులకు చెక్కులు పంపిణీ చేసిన ఆయన డీసీసీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ ఏటీఎం వాహనాలను ప్రారంభించారు. 

అనేక వాణిజ్య బ్యాంకులున్నప్పటికీ సహకార బ్యాంకుల ద్వారానే రైతాంగానికి సహకారం అందుతుందని చెప్పారు. ప్రాథమిక స్థాయిలో రైతులకు సహకార బ్యాంకులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దీనికోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు నియంత్రిత సాగువైపు మళ్లాలని, లాభసాటి పంటలనే సాగుచేయాలని చెప్పారు. 


logo