బుధవారం 03 జూన్ 2020
Telangana - May 02, 2020 , 22:47:49

ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి సహకారం

ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి సహకారం

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపధ్యంలో వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి చాలా మంది ఇక్కడే చిక్కుకుపోయారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వారిని తమ స్వస్థలాలకు చేర్చేందుకు  కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించారు. వెస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ర్టాలకు. నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ను రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ర్టాలకు సంబంధించిన నోడల్‌ అధికారులుగా నియమిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అధికారులకు రామకృష్ణ(9849038218), బన్వర్‌లాల్‌(9246536627)లు లోకల్‌ కోఅర్డినేటర్లుగా వ్యవహారిస్తారని సీపీ తన ఉత్తర్వులలో పేర్కొన్నారు. 


logo