ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 00:56:20

రైతుల మేలుకే నియంత్రిత సాగు

రైతుల మేలుకే నియంత్రిత సాగు


సమీక్షలో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతు ల మేలుకోసమే రాష్ట్రంలో నూతన వ్యవసాయవిధానం అమలుచేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం అమలుపై బుధవారం మంత్రుల నివాస సముదాయంలో అధికారులతో నిరంజన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అన్నారు. రైతులు ఆశించేస్థాయి నుంచి శాసించేస్థాయికి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నాణ్యమైన విత్తనాలు అందేలా పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. వానకాలంలో వేసే ప్రతి పంట రికార్డు  కావాలని.. నేలలు వర్గీకరించి, అక్కడ పండే  పంటలను గుర్తించాలని సూచించారు. సమీక్షలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్‌ వెంకట్రాంరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ కేశవులు పాల్గొన్నారు.


logo