శుక్రవారం 03 జూలై 2020
Telangana - May 26, 2020 , 02:13:01

నియంత్రిత సాగుపై ఏకమవుతున్న ఊర్లు

నియంత్రిత సాగుపై ఏకమవుతున్న ఊర్లు

  • తీర్మానాలు తీన్మార్‌!
  • నియంత్రిత సాగుపై ఏకమవుతున్న ఊర్లు
  • సీఎం చెప్పిన పంటే సాగుచేస్తామని రైతుల ప్రతిజ్ఞ
  • గ్రామాల్లో సమగ్ర సాగు అవగాహన సదస్సులు
  • గజ్వేల్‌ నియోజకవర్గంలో 149 ఊర్లు సారుబాట
  • జగదేవ్‌పూర్‌ మండలంలో అన్నిగ్రామాలదీ అదేదారి 
  • ఉమ్మడి మెదక్‌లో 207 గ్రామాల్లో తీర్మానాలు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం సూచించిన ప్రకారమే ‘సాగు’తామని రైతన్న నినదిస్తున్నాడు. నియంత్రిత పంటల సాగుకు సై అంటూ గ్రామగ్రామాన తీర్మానాల తీన్మార్‌ మోగిస్తున్నాడు. సమగ్ర వ్యవసాయ విధానానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నాడు. రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయాధికారులు గ్రామాల్లో నిర్వహిస్తున్న సదస్సులకు అద్భుత స్పందన లభిస్తున్నది. ప్రజలంతా ఒక్కచోట చేరి నియంత్రిత సాగుకు అనుకూలమంటా ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన ప్రతులను అధికారులు, ప్రజాప్రతినిధులకు అందజేస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 207 గ్రామాల రైతులు తీర్మానాలు చేశారు. సిద్దిపేట జిల్లాలో ఆదివారం 73 గ్రామాల్లో రైతులు ప్రతినబూనగా.. సోమవారం మరో 104 గ్రామాలు తీర్మానాలు చేశాయి. 

సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో 173 గ్రామాలకుగాను 149 గ్రామాల్లో రైతులు తీర్మాన ప్రతులను అధికారులకు అందజేశారు. నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్‌ మండలంలోని అన్నిగ్రామాల రైతులు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ పీ వెంకట్రామ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రావణ్‌కుమార్‌కు తీర్మానప్రతులను అందించారు. మెదక్‌ జిల్లాలో 28 గ్రామాల రైతులు నియంత్రిత సాగుపై తీర్మానాలు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌ మండలం నర్సంపల్లిలో అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి, హుస్నాబాద్‌ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్‌లో ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌, గజ్వేల్‌ మండలంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి నియంత్రిత సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రైతులు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

సిద్దిపేట జిల్లాలో రెండోరోజు తీర్మానాలు చేసిన గ్రామాలు 

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా రెండవరోజు 104 గ్రామాలు ఏకగ్రీవతీర్మానాలు చేశాయి. నియోజకవర్గాలవారీగా గజ్వేల్‌లో 61, సిద్దిపేటలో 17, దుబ్బాకలో 18, హుస్నాబాద్‌లో 7 గ్రామాలు ఉండగా.. జనగామ నియోజకవర్గంలోని చేర్యాలలో ఒకగ్రామం తీర్మానం చేసింది.

వర్గల్‌: వేలూరు, గౌరారం, తున్కిమక్తా.

ములుగు: శ్రీరాంపూర్‌, నర్సాపూర్‌, బండమైలారం, తున్కిమక్తా, జప్తి సింగాయిపల్లి, నర్సంపల్లి. 

కొండపాక: తిప్పారం, గిరాయిపల్లి, తిమ్మారెడ్డిపల్లి, కోనాయిపల్లి, మర్పడగ.

జగదేవ్‌పూర్‌: జగదేవ్‌పూర్‌

గజ్వేల్‌: పిడిచెడ్‌, శేరిపల్లి, దాచారం, కొడకండ్ల, శ్రీగిరిపల్లి, గిరిపల్లి, 

మర్కూక్‌: గణేశ్‌పల్లి, అంగడికిష్టాపూర్‌, చేబర్తి, నర్సన్నపేట, వర్దరాజుపల్లి, కర్కపట్ల, కాశిరెడ్డిపల్లి, భవనందపూర్‌, మర్కూక్‌, పాములపర్తి, ఇప్పలగూడ.

చిన్నకోడూరు: గోనెపల్లి, రామునిపట్ల, విఠలాపూర్‌, అనంతసాగర్‌, పెద్దకోడూరు, మల్లారం, ఇబ్రహీంనగర్‌, సికింద్లాపూర్‌, కస్తూరిపల్లి, మాచాపూర్‌.

నారాయణరావుపేట: బంజేరుపల్లి, గుర్రాలగొంది, మల్యాల.

సిద్దిపేట రూరల్‌: రాఘవాపూర్‌, పుల్లూరు. 

నంగునూరు: సిద్దన్నపేట, తిమ్మాయిపల్లి.

చేర్యాల: ముస్త్యాల.

దుబ్బాక: ఆరెపల్లి, ధర్మాజిపేట. 

మిరుదొడ్డి: భూంపల్లి, జంగపల్లి, లింగుపల్లి, కొండాపూర్‌, కాసులాబాద్‌.

తొగుట: బండారుపల్లి, ఘణపూర్‌, కాన్గల్‌, జప్తిలింగారెడ్డిపల్లి. 

రాయిపోల్‌: రాయిపోల్‌, వడ్డెపల్లి, చిన్నమాసాన్‌పల్లి. 

దౌల్తాబాద్‌: శేరిపల్లి, బందారం, ముబారస్‌పూర్‌, నర్సంపల్లి. 

అక్కన్నపేట: జనగామ, చౌటపల్లి, రేగొండ, నందారం. 

కోహెడ: బస్వాపూర్‌, వింజపల్లి,.

హుస్నాబాద్‌: పొట్టపల్లి. 

మెదక్‌ జిల్లాలో 28 గ్రామాలు 

మనోహరాబాద్‌: కాళ్లకల్‌, రామాయిపల్లి, కూచారం, కోనాయిపల్లి పీటీ, జీడిపల్లి, కొండాపూర్‌, ముప్పిరెడ్డిపల్లి, మనోహరాబాద్‌, చెట్లగౌరారం, రంగాయిపల్లి, లింగారెడ్డిపల్లి, దండుపల్లి, పలాట, ఏజీ వెంకటాపూర్‌.

తూప్రాన్‌: వెంకటరత్నాపూర్‌, వెంకటాయిపల్లి, నర్సంపల్లి, యావాపూర్‌, కోనాయిపల్లి బీజీ, ఇమాంపూర్‌, ఇస్లాంపూర్‌, గుండిరెడ్డిపల్లి, నాగులపల్లి, దాతర్‌పల్లి, ఘణపూర్‌, మల్కాపూర్‌, కిష్టాపూర్‌, వట్టూర్‌. 

స్టేషన్‌ఘన్‌పూర్‌లో 21 గ్రామాలు ప్రతిజ్ఞ

వేలేరు/ధర్మసాగర్‌: నియంత్రితసాగు విధానానికి తాముకూడా సిద్ధమేనని స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని 21 గ్రామాల రైతులు ముందుకొచ్చారు. ఇందులో వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలంలోని వేలేరు, సోడషపల్లి, మల్లికుదుర్ల, గుండ్లసాగర్‌, ధర్మసాగర్‌ మండలంలోని ధర్మసాగర్‌, జానకిపురం, రాయగూడెం, సోమదేవరపల్లి, దేవునూరు, ముప్పారం, పెద్ద పెండ్యాల, శాయిపేట, మల్లక్‌పల్లి, ధర్మాపురం, జనగామ జిల్లా చిలుపూరు మండలం చిన్నపెండ్యాల రైతులు ప్రతిజ్ఞచేశారు. సీఎం కేసీఆర్‌ సారు బాటలోనే ‘సాగు’తామని నినదించారు. వేలేరు మండలంలోని సోడషపల్లిలో రైతుబంధు సమితి రాష్ట్ర కన్వీనర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. జనగామ జిల్లా చిలుపూరు మండలం చిన్నపెండ్యాలలో జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. 


logo