శనివారం 11 జూలై 2020
Telangana - May 30, 2020 , 14:04:06

రైతులకు బాసటగా నిలిచేందుకు నియంత్రిత సాగు : మంత్రి జగదీశ్‌రెడ్డి

రైతులకు బాసటగా నిలిచేందుకు నియంత్రిత సాగు : మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట : రైతులకు బాసటగా నిలిచేందుకే ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని సూచిస్తుందని రాష్ట్ర మంత్రి మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నియంత్రిత సాగు విధానంపై రైతులకు, అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... డిమాండ్‌ ఉన్న పంటలను మాత్రమే సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. దళారుల మోసానికి గురైతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ క్రమంలో అందరూ రైతులకు బాసటగా నిలవాలన్నారు. అంతకుముందు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ ద్వారా రైతులకు రుణమాఫీ, రుణాల మంజూరు చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే రజాక్‌, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.


logo