ఆదివారం 12 జూలై 2020
Telangana - May 28, 2020 , 21:14:27

రైతులు నష్టపోకూడదనే నియంత్రిత వ్యవసాయం..

రైతులు నష్టపోకూడదనే నియంత్రిత వ్యవసాయం..

నిజామాబాద్: రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం శ్రీనగర్‌, పాత వర్నిలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులకు స్పీకర్ పోచారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు నష్టపోకూడదనే సీఎం కేసీఆర్‌ నియంత్రిత వ్యవసాయంపై దృష్టి సారించారన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేస్తే రైతులు లాభాలు ఆర్జిస్తారని సూచించారు.  

నియంత్రిత వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మండల స్థాయి వ్యవసాయ అధికారులదేనని పోచారం స్పష్టం చేశారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి పంటలు పండించే అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సూచించిన ప్రకారం సన్నరకాలనే పండిస్తామని రైతులంతా ఏకగ్రీవ తీర్మానం చేసి.. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రతులను అందజేశారు.  


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo