గురువారం 09 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 02:48:40

రైతుల సంక్షేమానికి కృషి

రైతుల సంక్షేమానికి కృషి

  • వినోద్‌తో నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: తెలంగాణ రైతుల సంక్షేమానికి అం డగా ఉంటామని, తమవంతు పూర్తి సహకారం అందిస్తామని నాబార్డ్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు అన్నారు. మంగళవా రం రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ప్రతిపాదనలను బట్టి ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ను కలువాలనుకుంటున్నానని, హైదరాబాద్‌ పర్యట కు వచ్చినపుడు కలుస్తానన్నారు. అటు.. నాబార్డు సీజీఎం వై కృష్ణారావు వినోద్‌కుమార్‌తో సమావేశమై.. రాష్ట్రంలో రైతుల సంక్షేమం పై చర్చించారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను కొనియాడారు. కరోనా నేపథ్యంలో రైతుల నుంచి రూ.20 వేల కోట్ల పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయడం చరిత్రాత్మకమన్నారు.


logo