బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 00:33:07

పాల ఉత్పత్తి పెంపునకు కృషి

పాల ఉత్పత్తి పెంపునకు కృషి

  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రజావసరాలకు అనుగుణంగా పాల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ చెప్పారు. మంగళవారం కరీంనగర్‌ పాల ఉత్పత్తిదారుల సంఘం వారి పంపిణీ కేంద్రాన్ని నగరంలోని నిజాంపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి రోజూ 80 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, అందులో సగం పాడిరైతులు గృహావసరాలకు వినియోగించుకుంటున్నారని తెలిపారు. పాలఉత్పత్తిని పెంచే చర్యల్లో భాగంగా లీటరుకు రూ.4 ఇన్సెంటివ్‌ అందిస్తున్నట్టు వివరించారు. 


logo