మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 13, 2020 , 00:45:55

సహకార సంఘాల బలోపేతానికి కృషి

సహకార సంఘాల బలోపేతానికి కృషి
  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: సహకార సంస్థలను పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు కొత్తగా ఎన్నికైన సహకార సంఘాల చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, డైరెక్టర్లు కృషిచేయాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీశ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన డీసీసీబీ మేనేజింగ్‌ కమిటీ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న విధానాలు, రైతుబంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని పని చేయాలని సూచించారు. ఈనెల 27తో మహబూబ్‌నగర్‌ డీసీసీబీ వందేండ్లు పూర్తవుతుందన్న సందర్భంగా వేడుకల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ నిజాంపాషా, వైస్‌ చైర్మన్‌ కొరమోని వెంకటయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు. logo
>>>>>>