బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 13:33:40

ఆదిలాబాద్‌ అభివృద్ధికి సహకరించాలి

ఆదిలాబాద్‌ అభివృద్ధికి సహకరించాలి

ఆదిలాబాద్ : పట్టణ అభివృద్ధికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న కోరారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని దేవి చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిర్మిస్తున్న డివైడర్ పనులను ఎమ్మెల్యే జోగు రామన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పట్టణంలోని అంతర్గత రోడ్ల మధ్యలో డివైడర్‌ నిర్మాణంతోపాటు సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


logo