e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home తెలంగాణ తెలంగాణ హితానికే మద్దతు

తెలంగాణ హితానికే మద్దతు

  • టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పలు సంఘాల అండ
  • పల్లా, వాణీదేవికే పట్టం కడుతామంటూ తీర్మానాలు
  • మంత్రి కేటీఆర్‌ను కలిసిన కాంట్రాక్ట్‌ టీచర్స్‌ సంఘాలు
  • రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ జేఏసీ మద్దతుపై మంత్రి గంగుల హర్షం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌, మార్చి 12: తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తు న్న టీఆర్‌ఎస్‌కు అన్ని వర్గాలు మద్దతునిస్తు న్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరి లో నిలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎస్‌ వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి వివిధవర్గాలు అండగా నిలుస్తున్నాయి. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌తో శుక్రవారం భేటీ అయిన యూనివర్సిటీ టీచర్స్‌ అసొసియేషన్‌ తెలంగాణ స్టేట్‌ (ఉథాట్స్‌) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ పరశురాం, డాక్టర్‌ బైరి నిరంజన్‌ మద్దతు ప్రకటించారు. తెలంగాణ యూ నివర్సిటీస్‌ టీచర్స్‌ అసోసియేషన్‌-కాంట్రాక్ట్‌ (తుటా-సి) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. వేల్పులకుమార్‌, ప్రధానకార్యదర్శి డా. సీహె చ్‌ వెంకటేశ్‌, కోశాధికారి టీ వెంకటేశం గురువారం రాత్రి మంత్రి కేటీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్న లేఖను అందజేశారు. సాంస్కృతిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాధన నరసింహాచార్యులు, వేద దార్మిక సేవాసమితి అధ్యక్షుడు కొండపాక కృష్నమాచార్యులు, సంభాషణ సంస్కృతం అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేంద్రకృష్ణ, ఈ మూడు అసోసియేషన్ల గౌరవాధ్యక్షుడు రవీందర్‌సింగ్‌, యూనివర్సిటీల కాంట్రాక్టు టీచర్ల అసోసియేషన్‌ నేతలు  మంత్రి హరీశ్‌రావును కలిసి మద్దతు తెలిపారు. క్రిస్టియన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, యునైటెడ్‌ పాస్టర్స్‌ అండ్‌ లీడర్స్‌ ఆఫ్‌ తెలంగాణ ప్రతినిధులు  మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. 2.50 లక్షలకుపైగా సభ్యులున్న 27 సంఘాల రిటైర్డ్‌ ఉద్యోగుల, పెన్షనర్ల జేఏసీ చైర్మన్‌ కొలిశెట్టి లక్ష్మయ్య టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతూ మంత్రి గంగులకు తీర్మానం ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ హర్షం వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు చలకాని వెంకట్‌యాదవ్‌, తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు ఏ రాజేశ్వర్‌యాదవ్‌, సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంకినేని మధుసూధన్‌రావు, ప్రధాన కార్యదర్శి మహిపాల్‌ రెడ్డి  టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వాణీదేవి విజయానికి బ్రాహ్మణ సమాజమంతా కృషి చేయాలని మన బ్రాహ్మణ సమాజం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీరాంభట్ల దీపక్‌ బాబు పిలుపునిచ్చారు. 

టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపిన సంఘాలు

తెలంగాణ విద్యుత్తు శాఖ ఉన్నతాధికారుల సంఘం, మున్సిపల్‌ ఉద్యోగుల సంఘం, వాహన సంఘాలు, డీడీఎన్‌ అర్చక సంఘం, బీసీ కులాల ఫెడరేషన్‌, కళాకారుల సంఘాలు, తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల సంఘం, తెలంగాణ పాలిటెక్నిక్‌ అధ్యాపకుల సంఘం, తెలంగాణ ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాల సంఘం (ట్రస్మా), పీఆర్టీయూటీఎస్‌, తెలంగాణ ఐక్య ఉపాధ్యా సంఘం (టీయూటీఎఫ్‌), నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం, గ్రూప్‌-1 అధికారుల సంఘం, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్లు, కాంట్రాక్టు లెక్చరర్లు, అవుట్‌ సోర్సింగ్‌ లెక్చరర్ల సంఘం, ప్రభుత్వ డిగ్రీ అధ్యాపకుల సంఘం, హోంగార్డు సంక్షేమ సంఘం, మున్నూరు కాపు సంఘం, గౌడ సంఘం, ప్రైవేటు డాక్టర్ల సంఘం, జర్నలిస్టుల సంఘాలు సాంస్కృతిక రాష్ట్ర అసోసియేషన్‌, వేద ధార్మిక సేవా సమితి, సంభాషణ సంస్కృతం అసోసియేషన్‌, యూనివర్సిటీల కాంట్రాక్టు టీచర్ల అసోసియేషన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana