గురువారం 28 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 16:21:29

విద్యాశాఖ మంత్రితో కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల భేటీ

విద్యాశాఖ మంత్రితో కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల భేటీ

హైద‌రాబాద్ : రాష్ర్ట విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో ప‌ని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల సంఘం ప్ర‌తినిధులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌కున్న స‌మ‌స్య‌ల‌ను విద్యాశాఖ మంత్రికి వారు విన్న‌వించారు. కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల బ‌దిలీల‌పై సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకుని నెల రోజులు అవుతున్న‌ప్ప‌టికీ, మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేయ‌డంలో జాప్యం జ‌రుగుతుంద‌ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బ‌దిలీల‌ను అడ్డుకునేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని లెక్చ‌ర‌ర్లు వాపోయారు.  

కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల బ‌దిలీల‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల‌కు న్యాయం జ‌రిగేలా చూస్తామ‌న్నారు. విద్యాశాఖ మంత్రిని క‌లిసిన వారిలో ఆర్జేడీ సంఘం రాష్ర్ట అధ్య‌క్షుడు గాదె వెంక‌న్న‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కుమార్, గోవ‌ర్ద‌న్‌, చంద్ర‌మౌళి ఉన్నారు. 

ఇవి కూడా చ‌ద‌వండి..

త‌మిళ‌నాడులో మ‌రో కొత్త పార్టీ.. ఎవ‌రిదంటే!
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు
ఐపీఎల్‌లో 10 టీమ్స్‌.. బీసీసీఐ ఆమోదం


logo