సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 20:20:43

కరీంనగర్‌లో నిరంతరాయంగా శానిటేషన్ పనులు

కరీంనగర్‌లో నిరంతరాయంగా శానిటేషన్ పనులు

కరీంనగర్:  కరోనా వైరస్ ను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  కరీంనగర్ నగరపాలక సంస్థ లో పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన   ట్రాక్టర్ మోంటెడ్ హై స్పీడ్ జెట్స్ ను మంత్రి గంగుల కమలాకర్  ప్రారంభించారు...బల్దియా కార్యాలయం సమీపంలో రోడ్డుపై హైపో క్లోరైడ్  ( లిక్విడ్ బ్లీచింగ్ పౌడర్ న్) స్ప్రే చేశారు.  ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ప్రజలను ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నగరం మొత్తం శానిటేషన్ చేస్తున్నామని  చెప్పారు. నిన్న 65 సిలిండర్ లతో నగరంలో శానిటేషన్ ప్రారంభించామని, అనుకున్నంత వేగంగా నగరం మొత్తం  పనులు జరగకపోవడంతో తో... గ్రామీణ ప్రాంతాలలో పంట పొలాలకు ఉపయోగించే 7 ట్రాక్టర్ మౌంటెడ్ హై స్పీడ్ జెంట్స్ ను సానిటేషన్ చేసేందుకు వినియోగిస్తున్నామని అన్నారు.దానిలో భాగంగా నేడు రెండు ట్రాక్టర్లను డెమోగా తీసుకువచ్చి నగరంలో పారిశుద్ధ్య పనులు ప్రారంభించామని తెలిపారు.

ఈ హై స్పీడ్ జెంట్స్ ట్రాక్టర్లు ఒకసారి స్ప్రే చేసుకుంటూ వెళితే రోడ్డుకిరువైపులా మొత్తం ఒకేసారి  క్లీన్ అవుతుందని పేర్కొన్నారు.  కరోనా వైరస్ లేదని భావనలో ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని మరో పది రోజులు అప్రమత్తంగా ఉండాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. నగర నగరపాలక ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు మార్చి 31 వరకు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటాయని అన్నారు... కరీంనగర్ నుంచి కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరు సామాజిక దృక్పథంతో వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతోపాటు మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, అధికారులు పలువురు టీఆర్ఎస్ నాయకులు తదితరులు  పాల్గొన్నారు.


logo