గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 26, 2020 , 08:19:16

వికారా‌బాద్‌లో భారీవ‌ర్షం.. అలుగు పోస్తున్న చెరువులు

వికారా‌బాద్‌లో భారీవ‌ర్షం.. అలుగు పోస్తున్న చెరువులు

వికారాబాద్‌: నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వ‌ర్షాల‌తో వికార‌బాద్ జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా వ్యా‌ప్తంగా మోస్తారు నుంచి భారీ వ‌ర్షం న‌మోద‌య్యింది. దీంతో కోట్‌ప‌ల్లి, శివ‌సాగ‌ర్ చెరువు‌, స‌ర్పంప‌ల్లి, ల‌క్నాపూర్ ప్రాజెక్టులు అలుగుపోస్తున్నాయి. దీంతో దిగువ గ్రామాల ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. 


మ‌హ‌బూబాద్ జిల్లాలో కురిసిన వాన‌ల‌తో గ్రామాలు వ‌ర్ష‌పు నీటిలో చిక్కుకున్నాయి. జిల్లాలోని పెద్ద‌వంగ‌ర మండ‌లం గండ్ల‌కుంట‌లో అర్థ‌రాత్రి దాటిన‌త‌ర్వాత కురిసిన భారీ వానతో వీధుల్లో వ‌ర‌ద నీరు చేరింది. దీంతో ఇళ్లు వ‌ర్ష‌పు నీటితో నిండిపోయాయి. logo