సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 08:03:37

‘కృష్ణా’ ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో..

‘కృష్ణా’ ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో..

జోగులాంబ గద్వాల/ శ్రీశైలం/ నాగార్జునసాగర్ : కుండపోత వర్షాలకు కృష్ణానదికి వరద స్థిరంగా కొనసాగుతోంది. ఇప్పటికే నదిపై అన్నీ ప్రాజెక్టులు నిండటంతో వస్తున్న ఇన్‌ఫ్లోను దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం ఉదయానికి జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 1,63,000 క్యూసెక్కుల వరద వస్తోంది. 20 గేట్లను ఎత్తి 1,67,835 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు 9.657 (టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1043 అడుగులు (8.830 టీఎంసీలు)గా ఉంది.

శ్రీశైలం జలాశయానికి 1,74,869 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు (215.8 టీఎంసీ)లు కాగా ప్రస్తుతం 884.2 అడుగులు (210.9) టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,16,033 క్యూసెక్కులు, కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా 13,076 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. 

నిన్నటితో పోలిస్తే నాగార్జున సాగర్‌కు కాస్త ఇన్‌ఫ్లో తగ్గింది. ఎగువ నుంచి 1,61,499 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. అధికారులు 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,61,499 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.10 అడుగులు (309.35 టీఎంసీలు) గా ఉంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



logo