గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 09:42:12

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

నల్లగొండ : నాగార్జున సాగర్‌కు ఎగువ శ్రీశైలం నుంచి స్థిరంగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. గతంలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో అధికారులు వచ్చిన వరదను పులిచింతల వైపు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నాలుగు క్రస్టుగేట్లను 5 అడుగుల మేర ఎత్తి స్పిల్‌ వే ద్వారా  39,293 క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు.

కుడి కాల్వకు 4 వేల క్యూసెక్కులు, పవర్‌ హౌజ్‌ ద్వారా4696 61 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు నీటి విడుదల లేదు. పవర్‌ హౌజ్‌ ద్వారా 7161 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 24619 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 1800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తంగా 81,922 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో వెళ్తోంది. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టాన్ని కొనసాగిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.