శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 03, 2020 , 10:21:40

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో..

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో..

నల్లగొండ :  నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 1,48,356 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిండటం.. ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటంతో అధికారులు నాలుగు క్రస్టుగేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్‌ వే ద్వారా నదిలోకి 59,816 క్యూసెక్కులు వదులుతున్నారు. కుడి కాల్వకు 8642 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 5725 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 1800 క్యూసెక్కులు, లోలెవల్‌ కెనాల్‌కు 600 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 29,279 క్యూసెక్కులు మొత్తం 1,05,856 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 590 అడుగులు(312.4) టీఎంసీలు కాగా ప్రస్తుతం 589.70 అడుగులు (311.14) టీఎంసీలు ఉంది.

శ్రీశైలం 5 క్రస్టుగేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల..

శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ జూరాల నుంచి 1,38,264 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. రిజర్వాయర్‌ ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండటంతో ప్రాజెక్టు 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,66,549 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌ వైపు వదులుతున్నారు. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 884.60 అడుగులు ( 213.40 టీఎంసీలు)గా ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.