మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 13:31:01

జయశంకర్‌ సార్‌ ఆశయ సాధనకు నిరంతర కృషి

జయశంకర్‌ సార్‌ ఆశయ సాధనకు నిరంతర కృషి

మహబూబాబాద్‌: తెలంగాణ సిద్దాంతకర్త ప్రొ. జయశంకర్‌ సార్‌ ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రకటించారు. జయంశకర్‌ సార్‌ తొమ్మిదో వర్థంతి సందర్భంగా మహబూబాబాద్‌లో ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేగాని మన నిధులను మనం ఖర్చు చేసుకోలేమని, మన ఉద్యోగాలు మనకు దక్కవని తన కొనఊపిరి వరకు తెలంగాణ కోసం పోరాడారని చెప్పారు. 

బంగారు తెలంగాణ కోసం కలలుగన్న జయశంకర్‌ సార్‌ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్‌ నిరంతరం శ్రమిస్తున్నారని వెల్లడించారు. నీళ్లులేక బీడువారిన తెలంగాణను కాళేశ్వరం ప్రాజెక్టుతో మూడు పంటలు పండే మాగానిగా మారుస్తున్నారని, ఇదే జయశంకర్‌ సార్‌కు అసలైన నివాళి అని చెప్పారు. ప్రతి రంగంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు.


logo