మంగళవారం 26 జనవరి 2021
Telangana - Sep 26, 2020 , 10:04:51

కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

నాగర్‌కర్నూల్‌/నల్లగొండ : రెండునెలలుగా విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా బేసిన్‌లో అన్ని ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండి కళకళలాడుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండురోజులుగా నది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్లు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ జూరాల నుంచి 1,53,607క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు 3 క్రస్టుగేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్‌కు 1,14,542 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.8070) టీఎంసీలు కాగా ప్రస్తుతం 884.70 అడుగులు (213.88) టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయి విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. 

నాగార్జున సాగర్‌ 10 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల..

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,09,284 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 80,580 క్యూసెక్కులు స్పిల్‌ వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.  విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా  28,704 క్యూసెక్కులు, కుడికాల్వకు 8,680 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 7,110 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకీ 1800, లోలెవ్‌ కెనాల్‌కు 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.60 అడుగులు (310.84) టీఎంసీలుగా ఉంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo