గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 11:18:03

శంషాబాద్ వద్ద కంటేనర్‌లో చేలరేగిన మంటలు

శంషాబాద్ వద్ద కంటేనర్‌లో చేలరేగిన మంటలు

హైదరాబాద్‌ :  ట్యాబ్‌లేట్ల లోడోతో వస్తునన కంటేనర్‌లో మంటలు చేలరేగిన ఘనట రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాన్సీమియాగుడా వద్ద బెంగుళూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బెంగుళూరు నుంచి మైక్రో ల్యాబ్‌కు సంబంధించిన ట్యాబ్‌లేట్ల లోడుతో వస్తున్న కంటేనర్ శంషాబాద్ ఘాంన్సిమియాగుడా వద్దకు రాగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

మంటలను గమనించిన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి స్థానిక పొలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందిని రప్పించి మంటలను అదుపు చేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo